Header Banner

కోర్టు హెచ్చరికల్ని లెక్కచేయని అధికారి..! చివరికి తహసీల్దార్‌గా..!

  Sat May 10, 2025 14:41        Politics

ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న తాతా మోహన్‌రావును తహసీల్దార్‌ స్థాయికి డిమోట్‌ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2013లో తహసీల్దార్‌గా పనిచేస్తున్నప్పుడు ఆయన హైకోర్టు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడులో గుడిసెలను తొలగించడాన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణనలోకి తీసుకొని ఈ వేటు వేసింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ ఏజీ మసీహ్‌లతో కూడిన బెంచ్‌ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు హైకోర్టు మోహన్‌రావుకు 2 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ 2015 మార్చి 27న తీర్పిచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వ భూమిని రక్షించడానికే తాను చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నట్లు మోహన్‌ రావు కోర్టుకు వెల్లడించారు. ఏపీ విభజన ఉద్యమం జరుగుతున్న ఆ రోజుల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉండేవని, అందువల్ల కొందరు రాత్రికి రాత్రి వేసుకున్న గుడిసెలను మాత్రమే తొలగించామని చెప్పారు.

అయితే హైకోర్టు తీర్పు ప్రకారం తాను 48 గంటలకు మించి జైల్లో ఉంటే ఉద్యోగం పోతుందని, దానివల్ల తన కుటుంబం రోడ్డున పడుతుందని, పిల్లల చదువులు దెబ్బతింటాయని మోహన్‌రావు కోర్టులో వాపోయారు. దీంతో సుప్రీం కోర్టు, హైకోర్టు మోహన్‌రావుకు విధించిన శిక్షను సవరించి.. డిప్యూటీ కలెక్టర్‌ పదవి నుంచి తహసీల్దార్‌ పోస్టుకు డిమోట్‌ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆయన పేదల ఇళ్ల నిర్మాణం కోసం నాలుగు వారాల్లోపు రూ.లక్ష జరిమానా చెల్లించి, రసీదు కూడా కోర్టుకు సమర్పించాలి. తదుపరి పదోన్నతుల కోసం ఆయన సీనియారిటీని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి’ అని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిప్యూటీ కలెక్టర్‌ నుంచి తహసీల్దార్‌గా పనిచేసేందుకు అంగీకరిస్తూ అండర్‌టేకింగ్‌ లెటర్‌ ఇవ్వాలని గత వాయిదాల్లోనే సూచించినా మోహన్‌రావు అంగీకరించకపోవడంతో జస్టిస్‌ గవాయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “పిటిషనర్‌ తొలిరోజే ఇందుకు అంగీకరిస్తే మేం 2, 3 ఇంక్రిమెంట్ల కోతతో ఆపేసేవాళ్లం. కానీ నాలుగు వాయిదాల వరకు తీసుకొచ్చారు. ఈ రోజు కూడా అంగీకరించకపోతే ఏ ప్రభుత్వం సాహసించలేని ఉత్తర్వులిచ్చేవాళ్లం.” న్యాయమూర్తి అన్నారు.

ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #CourtContempt #SupremeCourtVerdict #TataMohanRao #OfficerDemotion #JudicialAction #TahsildarPosting #LegalConsequences